హైదరాబాద్: 28°C
తెలంగాణ

వార్డు సభ్యుడిపై చర్యలకు కలెక్టర్‌కు ఫిర్యాదు

KNR: గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామపంచాయతీ ఐదో వార్డు సభ్యుడు బొంగాని మహేశ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎనిమిదో వార్డు సభ్యుడు రాయికంటి ధర్మేందర్ కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. మహేశ్ వరుసగా ఐదు గ్రామసభలకు హాజరుకాలేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.