హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరాకు 1,233 ప్రత్యేక బస్సులు

ATP: దసరా పండుగ సందర్భంగా కడప ఆర్టీసీ జోన్ పరిధిలోని అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 1,233 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిశోర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లాకు 350, సత్యసాయి జిల్లాకు 160 బస్సులు కేటాయించారు. ఈ నెల 9 నుంచి 21వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి.