కాకినాడ: సామర్లకోట కెనాల్ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు CI కృష్ణ భగవాన్ తెలిపారు. భీమేశ్వర స్వామి ఆలయ మార్గంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇంద్రపాలెంకు చెందిన మణికంఠ సాయిని కాకినాడ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి


