హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి'

KDP: సిద్ధవటంలోని షాదీఖానా ఆవరణలో గురువారం రాత్రి ఎస్సై హారిక యువతకు చెడు అలవాట్లపై అవగాహన కల్పించారు. గంజాయి, మాదక ద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. రాబోయే స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు పాల్గొన్నారు.