హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి'

PLD: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పిలుపునిచ్చారు. నకరికల్లులో జరిగిన మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తల సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం పార్టీ నాయకులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.