హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి'

కృష్ణా: మచిలీపట్నం సబ్ డివిజన్ పరిధిలో నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని బందరు డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు సూచించారు. జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గురువారం రాత్రి కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్సవాలు విజయవంతం అయ్యేలా అందరూ సహకరించాలని కోరారు.