హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత టైలరింగ్ శిక్షణకు సర్టిఫికేట్లు

GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత టైలరింగ్ శిక్షణ పూర్తిచేసిన 30 మందికి ఎమ్మెల్యే నసీర్ గురువారం సర్టిఫికెట్లు అందజేశారు. అంజుమన్-ఇ-ఇస్లామీయ స్కూల్‌లో మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చారు. పీఎం విశ్వకర్మ పథకం కింద కుట్టు మిషన్లు అందించి, వాటిని కంపెనీలకు విక్రయించి డబ్బులు అందేలా చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.