హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లిలో జగన్‌తో వైసీపీ నేత భేటీ

VZM: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గురువారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే తనను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై గళం విప్పేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.