హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బంగారుపాళ్యంలో అభివృద్ధి పనులు ప్రారంభం

CTR: బంగారుపాళ్యం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే మురళీమోహన్‌ గురువారం ప్రారంభించారు. రూ.8.45 కోట్ల వ్యయంతో చేపట్టిన బీటీ, సీసీ రోడ్లతో పాటు అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. పూతలపట్టు నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తోందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని అన్నారు.