SKLM: కోటబొమ్మాళి మండలం కొత్తమ్మ తల్లి అమ్మవారి జాతర సందర్భంగా ఈనెల 13 నుంచి 15 వరకు 15 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి చి.అప్పలనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు. శ్రీకాకుళం డిపోల నుంచి టెక్కలికి 6, పలాస నుంచి కోటబొమ్మాళికి 3, టెక్కలి నుంచి బోరుభద్ర మీదుగా 3, పిన్నింటిపేటకు 3 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తమ్మ తల్లి జాతరకు ప్రత్యేక బస్సులు


