AKP: చీడికాడ మండలంలో పల్లె పండుగ 3.0 కింద రూ.కోటి అభివృద్ధి పనులకు మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శంకుస్థాపన చేశారు. అనంతరం కోణం పంచాయతీ పరిధిలోని మల్లెపాడు, దిబ్బపాలెం, దండి సురవరం గ్రామాల్లో నిర్మించిన వాటర్ ట్యాంకులను ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పనతో పల్లెల రూపురేఖలు మారుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు శంకుస్థాపన


