హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోకవరం:గంబుజియా చేపలతో దోమల లార్వా నిర్మూలన

EGDT: గోకవరం మండలం జి.కొత్తపల్లి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నిర్మూలన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా అచ్చియ్యపేట, సంజీవయ్యనగర్‌లో నిల్వ ఉన్న నీటిలో గంబుజ్జియా చేపలను వదిలారు. మలేరియా, డెంగీ, చికున్‌గున్యాకు కారణమయ్యే దోమల లార్వాలను ఈ చేపలు ఆహారంగా తీసుకుని వాటి వ్యాప్తిని నియంత్రిస్తాయని వైద్య సిబ్బంది తెలిపారు.