ELR: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 5న ప్రారంభమైన పవిత్రోత్సవాలు శాంతి కళ్యాణ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి. విశ్వక్సేనారాధన, నిత్య హోమం, పూర్ణాహుతి అనంతరం శాంతి కళ్యాణాన్ని వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి, అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం రిత్వికులను ఘనంగా సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
పారిజాతగిరిలో ముగిసిన పవిత్రోత్సవాలు


