హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేడికుర్తిలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం

అన్నమయ్య: కలికిరి మండలం మేడికుర్తిలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఎంపీడీవో భానుమూర్తి రావు, డీవై ఎంపీడీవో మహ్మద్ రియాజుద్దీన్ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. చెత్త నుంచి సంపద సృష్టిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.