హైదరాబాద్: 28°C
తెలంగాణ

కడెంలో వన్యప్రాణి ర్యాలీ

NRML: కడెం మండల కేంద్రంలో వన్యప్రాణి వారోత్సవాల ముగింపుగా ఖానాపూర్ అటవీ డివిజన్ అధికారులు జడ్పీ పాఠశాల విద్యార్థులతో గురువారం ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా FDO కాదారి అనిత మాట్లాడుతూ.. జీవవైవిధ్యం కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. పెద్దూరు-కడెం సర్పంచ్ డి.విజయ్‌కుమార్, కడెం, ఖానాపూర్, పెంబి రేంజ్ అధికారులు పాల్గొన్నారు.