హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆడేపల్లిలో పెరిగిపోతున్న జ్వర బాధితుల సంఖ్య

ASF: చింతలమానేపల్లి మండలం ఆడేపల్లి గ్రామంలో జ్వర బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రజలకు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ తగ్గుతుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.దీంతో సంబంధిత వైద్యాధికారులు గురువారం హెల్త్ క్యాంప్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. డెంగ్యూ, మలేరియాతో బాధపడుతున్న వారిని గుర్తించి కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు.