హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిక్చర్స్‌ షాప్‌లో అధికారుల తనిఖీలు

HYD: బేగంబజార్‌లోని జీఎం మిక్చర్స్‌పై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంస్థలో తయారీ ప్రక్రియ, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల కోసం పంపించారు. తనిఖీలకు సంబంధించిన నివేదికను తదుపరి చర్యల కోసం డిజిగ్నేటెడ్‌ ఆఫీసర్‌కు అధికారులు సమర్పించారు.