హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈసీ తీరుపై మంత్రి పొంగులేటి ఆగ్రహం

KMM: కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా ఓటర్ల జాబితా మార్పులు చేసి నిజమైన ఓటర్లను తొలగిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. దీనికి నిరసనగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ హైదరాబాద్‌లో టీపీసీసీ చేపట్టిన 'చలో రాజ్ భవన్' ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. సీఈసీ దిగిపోయే వరకు తమ పోరాటం ఆగేది లేదని మంత్రి స్పష్టం చేశారు.