హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ

PDPL: ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ను పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణ, రిసెప్షన్ కౌంటర్, టెక్ టీమ్ విభాగాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్లోని పలు రికార్డులను, కేస్ డైరీలను తనిఖీ చేశారు. ఈ మేరకు సిబ్బందితో సమావేశమై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.