హైదరాబాద్: 28°C
తెలంగాణ

గర్భిణులు ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయించుకోవాలి

BDK: ఆళ్లపల్లి స్థానిక పీహెచ్సీలో డాక్టర్ గోపీలాల్, హెల్త్ ఎడ్యుకేటర్ టి. రమాదేవి ఆధ్వర్యంలో గురువారం గర్భిణులకు ప్రసవ పూర్వ పరీక్షలు నిర్వహించారు. గర్భిణులు ప్రతి నెలా తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఐరన్ మాత్రలు, టీటీ టీకాలు తీసుకోవడంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అధిక రక్తపోటు, రక్తహీనతపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.