MLG: సిపిఎస్ ఉద్యోగుల సంఘం (TSCPSEU) ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా వనజ గురువారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని మహిళా ఉద్యోగులను ఏకం చేసి సిపిఎస్ రద్దుకై పోరాటాలు చేస్తామని, మహిళా ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తన నియామకానికి సహకరించిన సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
సిపిఎస్ ఉద్యోగుల సంఘం మహిళా అధ్యక్షురాలిగా వనజ


