హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోషకాహారం అత్యంత కీలకం'

VZM: చీపురుపల్లి ఐసీడీఎస్ కార్యాలయంలో పోషణ మాసం-2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పాల్గొని, చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం, పౌష్టికాహారం, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలను పరిశీలించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి చిన్నారుల ఆరోగ్యం, తల్లుల పోషకాహారం అత్యంత కీలకమని అన్నారు.