హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మృతుల కుటుంబాలను పరామర్శించిన వైసీపీ శ్రేణులు

ATP: గుత్తి పట్టణంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను వైసిపి జిల్లా నాయకుడు మంజునాథరెడ్డి పరామర్శించారు. ముందుగా మార్చరీలో ఉన్న మృతదేహాలకు నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు. స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు.