హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేగవరంలో వర్మీ కంపోస్ట్‌పై అవగాహన

ELR: జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామపంచాయతీలో ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌పై క్షేత్రస్థాయి అవగాహన సందర్శన నిర్వహించారు. 20 పంచాయతీల క్లాప్ మిత్రులు, సిబ్బంది వర్మీ కంపోస్ట్ తయారీ, తడి–పొడి చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. నెలకు టన్ను వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి చేసేలా చర్యలు చేపట్టాలని డిప్యూటీ ఎంపీడీవో సుజాత సూచించారు.