TPT: శ్రీకాళహస్తి డీఎస్పీగా బి. పావని గురువారం బాధ్యతలు స్వీకరించారు. సీఐలు, ఎస్‌ఐలు ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమని, యువతను పతనం చేస్తున్న గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తి డీఎస్పీగా పావని బాధ్యతలు స్వీకరణ


