హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన పార్కుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NTR: నందిగామ పట్టణంలోని 7, 8వ వార్డులకు అనుసంధానంగా గోవర్ధన గార్డెన్స్‌లో నూతన పార్క్ నిర్మాణానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. రూ.19 కోట్ల HAM నిధుల్లో భాగంగా ఈ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, యువతకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కోరారు.