అన్నమయ్య: ములకలచెరువులోని అంగన్వాడీ పాఠశాలల్లో పోషణ మాసోత్సవాలను గురువారం నిర్వహించారు. పౌష్టికాహారం ఉపయోగాలు, పరిశుభ్రత ప్రాధాన్యం, క్రమశిక్షణపై చిన్నారులకు అవగాహన కల్పించారు. పోషకాహార లోపంతో పిల్లల్లో ఎదుగుదల లోపించి, అనారోగ్య సమస్యలు వస్తాయని టీచర్లు రత్న, ఫర్హానా తెలిపారు. ఆటపాటలతో కూడిన విద్యతో పాటు పోషణపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ములకలచెరువులో పోషణ మాసోత్సవాలు


