హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాహుల్, ప్రియాంక అరెస్టుపై సరిత ఖండన

GDWL: ఓట్ల తొలగింపు, ఎస్‌ఐఆర్‌ అంశాలపై ప్రశ్నిస్తున్న రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును తెలంగాణ గొర్రెలు, మేకల సహకార కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ సరిత ఖండించారు. గురువారం గద్వాలలో ఆమె మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ప్రజల హక్కుల కోసం ప్రశ్నించే వారిపై చర్యలు సరికాదని పేర్కొన్నారు.