హైదరాబాద్: 28°C
తెలంగాణ

కస్తూర్బా పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

NZB: సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను, వంట గది, స్టోర్ రూమ్, తరగతి గదులను పరిశీలించారు. పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండి అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.