హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘన వ్యర్ధాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం

AKP: నక్కపల్లి మండలం వెంపాడు గ్రామంలోని SWPC షెడ్‌లో పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణపై హరిత రాయబారులకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. వర్మీ కంపోస్ట్ తయారీ, SWPC షెడ్ నిర్వహణ, తడి-పొడి చెత్త సేకరణలో బిన్ బ్యాగ్ విధానంపై అవగాహన కల్పించారు. ఇందులో ఇంఛార్జ్ ఎంపీడీవో డి.సీతారామరాజు, డిప్యూటీ ఎంపీడీవో గిరిజాజ్యోతి, పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు.