హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళల భద్రత అందరి బాధ్యత'

ASR: గూడెం కొత్తవీధిలో గురువారం మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు స్థానిక ఎస్సై కే.సురేష్ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలపై నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. మహిళలకు రక్షణ, గౌరవం కల్పించడం సమాజం బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.