హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంట్రాక్ట్ ఉద్యోగుల దీక్షకు సీపీఎం మద్దతు

ASR: ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు సీపీఎం మద్దతు తెలిపింది. ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని సీపీఎం అరకు మండల కార్యదర్శి రామారావు డిమాండ్ చేశారు. అరకులో దీక్షలు చేపట్టిన ఉద్యోగులను గురువారం కలిశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.