హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

కృష్ణా: తమ సేవలను గుర్తించి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. విధులను బహిష్కరించి మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు.