హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయితో యువకుడు అరెస్ట్

MDK: కొల్చారం మండలం అప్పాజీపల్లి శివారు వాహన తనిఖీల్లో పోలీసులు ఓ యువకుడిని అరెస్ట్ చేసి 46 గ్రా. ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కొల్చారానికి చెందిన టీ. సాయికుమార్‌(19)గా గుర్తించారు. బైక్ ట్యాంక్ కవర్‌లో గంజాయితో పాటు సెల్‌ఫోన్ లభించింది. బైక్‌, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని NDPS చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.