హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

8 మద్యం బార్లకు లాటరీ ద్వారా కేటాయింపులు

W.G: జిల్లాలో 2026–27 సంవత్సరానికి 8 మద్యం బార్ల కేటాయింపును లాటరీ పద్ధతిలో పారదర్శకంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం కలెక్టరేట్‌లో జరిగిన లాటరీలో 64 మంది దరఖాస్తుదారులు పాల్గొన్నారు. కాళ్ల, భీమవరం, నరసాపురం, పెనుగొండ, పెనుమంత్ర మండలాల్లోని బార్లకు అర్హులైన దరఖాస్తుదారులకు కేటాయింపులు జరిగాయనీ అధికారులు తెలిపారు.