NTR: జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ ఆదోక్షజానంద దేవతీర్థ జీ మహారాజ్ గురువారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు దేవాలయాల సందర్శనలో భాగంగా ఆయన విజయవాడకు విచ్చేసినట్లు చెప్పారు. ఆలయ అర్చకులు స్వామీజీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మను దర్శించుకున్న జగద్గురు శంకరాచార్య


