హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆధార్ క్యాంపును పరిశీలించిన డిప్యూటీ MPDO

ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలులోని కార్మెల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు క్యాంపును డిప్యూటీ ఎంపీడీవో టి.ముత్తయ్య గురువారం సందర్శించారు. విద్యార్థుల ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్డేషన్ ప్రక్రియను పరిశీలించారు. తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్యాంపును సక్రమంగా నిర్వహించి అందరికీ ఆధార్ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.