హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు అండగా షీ టీమ్స్

MDK: నర్సాపూర్‌ బస్టాండ్‌లో తూప్రాన్‌ సబ్‌డివిజన్‌ షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో ప్రయాణికులు, మహిళలకు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. బస్సు ప్రయాణాల్లో ఈవ్‌టీజింగ్‌ నివారణ, మహిళల రక్షణ కోసం ‘డయల్‌ 112’ సేవలపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో మహిళలు పోలీసులను సంప్రదించాలని, షీ టీమ్స్‌ ఎల్లప్పుడూ అండగా ఉంటాయని పోలీసులు తెలిపారు.