హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్‌స్టేషన్‌ను పరిశీలించిన టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ

SDPT: హుస్నాబాద్ 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను TGNPDCL సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి గురువారం పరిశీలించారు. లోడ్‌, ఫీడర్ల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.