హైదరాబాద్: 28°C
తెలంగాణ

కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కాలి: సీపీఎం

NLG: కొండమల్లేపల్లిలో సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి హాజరై మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు 0.5 టీఎంసీల నీటిని అందించాలన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి గతంలో తీసుకెళ్లామన్నారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కాలన్నారు.