హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూముల రీ సర్వేను రద్దు చేయాలి'

SRCL: భూముల రీ సర్వేను రద్దు చేయాలని మండలంలోని అనంతపల్లె గ్రామ రైతులు వాపోయారు. అనంతపల్లి గ్రామంలోని రైతులకు గురువారం రెవెన్యూ అధికారులు భూముల రీ సర్వే సంబంధించిన నోటీసులను జారీ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. భూముల రీ సర్వే ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.