హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేజీబీవీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ

KDP: చక్రాయపేట కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ)లో రూ.1.19 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాలను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.