హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'అడ్డా కూలీల కూలి రేట్లు పెంచాలని డిమాండ్'

వనపర్తి జిల్లా కేంద్రంలోని అడ్డా కూలీల సమస్యలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గురువారం తెలుసుకున్నారు. కూలి రేట్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాల నుంచి పనికోసం వస్తున్నా ఉపాధి లభించక ఇబ్బందులు పడుతున్నామని కూలీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యాలు, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.