హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాశాల ల్యాబ్ టెక్నీషియన్ మృతి

MDK: తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామానికి చెందిన రామాయంపేట ప్రభుత్వ కళాశాల ల్యాబ్ టెక్నీషియన్ మరి రాజు బుధవారం రాత్రి మృతి చెందాడు. నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాజు అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ హిమజ్యోతి, అధ్యాపకులు సంతాపం తెలిపి దహన సంస్కారాలకు రూ. 30 వేలు అందజేశారు.