హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

11 నుంచి మాలే గంగమ్మ ఉత్సవాలు

KDP: పులివెందుల మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లెలోని మాలే గంగమ్మ ఆలయంలో ఈనెల 11 నుంచి 20 వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా గంగమ్మ తల్లి రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని గ్రామస్థులు కోరారు.