హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు సంఘాల ర్యాలీ, ధర్నా!

SRD: హత్నూర మండలం దౌల్తాబాద్‌లలో నిరంతర విద్యుత్ కోతలు, ఎదురవుతున్న రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ, ధర్నా నిర్వహించారు. సకాలంలో విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన కరెంట్ సరఫరా చేసి తమను ఆదుకోవాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.