హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

PLD: నరసరావుపేట మండలం ధర్నా చౌక్ వద్ద పల్నాడు భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. సంక్షేమ బోర్డు పథకాలను అమలు చేయాలని, ప్రమాద బీమా కల్పించి పూర్తి అంగవైకల్యానికి గురైన కార్మికులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. 14 రకాల సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.