NGKL: అమ్రాబాద్ మండలం వటువర్లపల్లిలో అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించారు. బీసీ-బీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన టీచర్, ఆయా పోస్టులకు మొత్తం 43 దరఖాస్తులను పరిశీలించినట్లు తెలిపారు. అర్హత, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తదుపరి ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
అంగన్‌వాడీ పోస్టుల దరఖాస్తుల పరిశీలన


