హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించిన కలెక్టర్

AKP: సంకల్ప అభియాన్-2026లో భాగంగా ఎన్టీఆర్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. పోషణ మాసం సందర్భంగా గర్భిణులకు సీమంతం నిర్వహించి, అంగన్వాడీ సిబ్బందిని సత్కరించారు. చిన్నారుల ఆరోగ్యకర ఎదుగుదలకు తొలి ఐదేళ్లు కీలకమని కొణతాల అన్నారు. ఆరోగ్యంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.