హైదరాబాద్: 28°C
తెలంగాణ

యోగ పోటీల్లో విద్యార్థినుల ప్రతిభ

NLG: దేవరకొండలోని తెలంగాణ గిరిజన మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు యోగాసన పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. హరిప్రియ తెలిపారు. ఇటీవల మిర్యాలగూడలో జిల్లా స్థాయి పోటీల్లో చక్కని ప్రతిభ కనబరిచారు. విజేతలు మాధురి, వెన్నెల శిరీష, నందిని, శ్రావణి, అనితను అభినందించారు. ఫిజికల్ డైరెక్టర్ మహేశ్వరి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.